03 Nevember 2023
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కిడ్నీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ చెడు జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారం కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి.
వాస్తవానికి మనం ఏది తిన్నా అది నేరుగా మన మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు
కిడ్నీ దెబ్బతినడానికి సంబంధించిన అనేక లక్షణాలు ఉదయాన్నే కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం..
మీ శరీరం ఉదయాన్నే చల్లగా అనిపిస్తే, అది కిడ్నీ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. వేసవి, చలికాలంలో ఉదయం సమయంలో శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండటం ముఖ్యం.
చాలా సార్లు మనం చేతులు.. కాళ్ళ వాపును సాధారణమైనదిగా భావించి అజాగ్రత్తగా ఉంటాం.. అయితే ఉదయం నిద్రలేవగానే చేతులు, కాళ్లలో వాపు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి.
ఎలాంటి కారణం లేకుండా చర్మంలో పదే పదే దురద రావడం కూడా కిడ్నీ సంబంధిత వ్యాధికి సంకేతం. చర్మ సమస్యలను పొరపాటున కూడా విస్మరించకూడదు.
మూత్రపిండాల్లో రాళ్లు లేదా సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇలాంటి లక్షణాలను విస్మరించకూడదు.
ఉదయం నిద్రలేచిన తర్వాత మీ శరీరంలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయవద్దు.. అలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.