శీతాకాలంలో ఈ ఫుడ్స్ తీసుకొంటే చాలు.. ఆరోగ్య సమస్యలు దూరం.. 

TV9 Telugu

15 November 2024

శీతాకాలంలో తలెత్తే నీరసానికి, బద్ధకానికి కొన్ని రకాల ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో బీట్‌రూట్‌ తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఇందులో జింక్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

శీతాకాలంలో ఎలాంటి సందేహాలు లేకుండా అరటి పండ్లను తినొచ్చు. వీటిల్లో విటమిన్ బి6, కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నందున తక్షణ శక్తి లభిస్తుంది.

శీతాకాలంలో తినాల్సిన ఆరోగ్యకరమైన ఫుడ్స్‌లో కోడి గుడ్లు కూడా ఒకటి. అమినో యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ ఎ, ప్రోటీన్లు, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఎగ్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

శీతాకాలంలో కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

శీతాకాలం సమయంలో డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల బరువు పెరుగుతారని అపోహతో వీటిని చాలామంది ప్రజలు దూరం పెడతారు.

కానీ నట్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరిగి.. ఇతర వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుందంటున్నారు నిపుణులు.