ఈ జ్యూస్‌లతో మలబద్దకం చెక్.. 

TV9 Telugu

08 June 2024

ప్రస్తుతం మారుతోన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఇటీవల మలబద్దకం సమస్య అందరిలోనూ కనిపిస్తోంది.

మలబద్దకం సింపుల్‌గా తీసుకుంటే హెమరాయిడ్స్‌, ఫిషర్స్‌, పైల్స్‌ వంటి అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.

మలబద్దకాన్ని తగ్గించడంలో యాపిల్ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది. దీనిని పండు రూపంలో కాకుండా జ్యూస్‌గా తీసుకుంటే ఇంకా ఫలితం త్వరగా లభిస్తుంది.

ఇందులో ఉండే ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గిస్తాయి. యాపిల్ జ్యూస్‌లో కొద్దిగా సోంపు గింజ‌ల పొడిని క‌లుపుకుని తాగితే ఎక్కువ ఫ‌లితం ఉంటుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, జీలకర్రను కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.

పైనాపిల్‌ లో ఉండే బ్రొమెయిలిన్‌ అనే ఎంజైమ్‌.. సుఖ విరేచనం కావడానికి ఉపయోగపడుతుంది. పేగుల్లో ఉండే మలాన్ని బయటకు పోయేలా చేస్తుంది.

నారింజ జ్యూస్‌ కూడా మలబద్దకాన్ని తరిమి కొడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

ద్రాక్షలో కూడా ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్దకంతో సతమతమయ్యే వారు రోజూ ఇది తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.