మీ మూత్రం ఇలాంటి రంగులో వస్తుందా..? డేంజర్‌లో ఉన్నట్లే..

04 April 2024

Shaik Madar Saheb

శరీరం కూడా ఒక యంత్రంలా పనిచేస్తుంది..  కొన్నిసార్లు చిన్న చిన్న లోపాలు ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

అనారోగ్యానికి గురవుతున్న క్రమంలో శరీరం మనకు కొన్ని సంకేతాలు ఇస్తోంది. అందుకే ఇలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి..

ముఖ్యంగా మూత్రం రంగు మారడం కూడా కొన్ని వ్యాధులకు సంకేతం కావొచ్చు.. వెంటనే అప్రమత్తం కావాలి..

కొన్నిసార్లు మూత్రం రంగు పసుపు రంగులో ఉంటుంది.. ఈ రంగు మూత్రం అలారం బెల్ లాంటిది.. 

ముదురు పసుపు రంగు మూత్రం స్పష్టంగా తెలియజేస్తుంది.  ఇలా అయితే, మీరు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు అర్ధం..

పసుపు రంగు మూత్రాన్ని గమనిస్తే.. మీరు తక్కువ నీరు తాగుతున్నారని అర్ధం.. దీన్ని నివారించడానికి, ఎక్కువ నీరు త్రాగాలి

సాధారణంగా మన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ముదురు పసుపు రంగులో మూత్రం వస్తున్నట్లయితేనే ప్రమాదం..

ఇంకా కామెర్లు ఉన్న వారు, బీ కాంప్లెక్స్, విటమిన్ మాత్రలు, పలు ఔషధాలు తీసుకుంటున్న వారిలోనూ మూత్రం ముదురు పసుపు లేదా ఆరెంజ్ రంగులోకి మారుతుంది.