ఉదయన్నే ఆలారంతో నిద్రలేస్తే ప్రమాదమా..

TV9 Telugu

20 August 2024

తరుచూ ఆలారం పెట్టుకుని నిద్రలేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిద్రలో ఉండగా మోగే ఆలారం శబ్ధం గుండె ఆరోగ్యానికి హాని చేస్తుందని వార్నింగ్‌ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆలారం పెట్టుకొని దాని సౌండ్‌ వల్ల రక్తపోటు, హార్ట్‌ బీట్‌ ఎక్కువవుతుంది. బ్రెయిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

రోజూ ఆలారం సౌండ్‌తో నిద్రలేస్తే నిద్ర చక్రానికి ఆటంకం ఏర్పడుతుంది. రోజంతా గజిబిజిగా, చికాకుగా ఉంటుంది.

సహజంగా మేల్కొనే ప్రక్రియ సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయానికి చక్కగా సెట్‌ చేయబడి ఉంటుంది చెబుతున్నారు.

ఆలారం పెట్టుకోవడం ద్వారా గాఢమైన నిద్రలో మేల్కొంటే.. స్లీపింగ్‌ సైకిల్‌కు భంగం కలిగి చిరాకు ఏర్పడుతుంది.

ఫైట్-ఆర్-ఫ్లైట్ ప్రతిస్పందన వల్ల శరీరం నుంచి కార్టిసాల్‌, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్స్‌ రిలీజ్‌ అవుతాయి.

ఈ హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే.. మెంటల్‌ ప్రెజర్‌ ఎక్కువవుతుంది. దీంతో హైపర్‌టెన్షన్‌, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.