ఆ విషయంలో బంధు మిత్రుల సలహాలకే ప్రాధాన్యత ఇస్తున్న భారతీయులు..
07 November 2023
శరీరాకృతి విషయంలో 76 శాతం మంది భారతీయులు బంధు మిత్రుల సలహాలకే ప్రాధాన్యత ఇస్తారాని పరిశోధకులు తెలిపారు.
5,000 మంది భారతీయ స్త్రీ, పురుషులను ఫిట్‌నెస్ టెక్నాలజీ యాప్ ఫిటెలో సర్వే నిర్వహించారు పరిశోధకులు.
56 శాతం మంది భారతీయులు తమ దుస్తులు బిగుతు అయినట్లనిపిస్తేనే బరువు తగ్గాలని చూస్తారని ఈ సర్వేలో తేల్చారు.
46 శాతం మంది బరువు పెరిగావని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అన్నప్పుడు మాత్రమే శరీర బరువు గురించి ఆలోచిస్తారట.
18 నుంచి 63 ఏళ్ల వయస్సు భారతీయలు వీరు చేసిన సర్వేలో పాల్గొన్నారు. వారిలో 77 శాతం మంది మహిళలే ఉన్నారు.
బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొన్నప్పుడు, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కువగా తింటామని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు.
పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి పెరిగి కాస్త ఎక్కువ తింటామని 35 శాతం మంది మహిళలు చెప్పారు.
పాశ్చాత్యుల్లా చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్‌ను తినే భారతీయులు బరువు తగ్గడానికి పాశ్చాత్యుల్లా కఠిన వ్యాయామం చేయడానికి ఇష్టపడరని తేల్చింది.