కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి..

07 December 2023

మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ మీద కూడా శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే ప్రొటీన్‌ పుష్కలంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అంతే కాకుండా ఎక్కవగా ప్రొటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారని అంటున్నారు.

రోజూ ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడంతో జీవ‌క్రియల వేగం పెరుగుతుంది. బ‌రువు త‌గ్గే అవకాశం ఉంది.

ప్రొటీన్ అధికంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌తో కంటి ఆరోగ్యం కూడా మెరుగ‌వుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కండ్లు ఆరోగ్యంగా ఉండాలంటే లుటిన్‌, జియాక్స‌న్‌థిన్‌, విట‌మిన్ ఈ, జింక్ వంటి పోష‌కాలు అవ‌స‌ర‌ం అంటున్నారు.

ప్రొటీన్లు రెటీనాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వ‌య‌సుతో పాటు వ‌చ్చే క్యాట‌రాక్ట్స్ వంటి సమస్యలను అరికడతాయి.

బాయిల్డ్ ఎగ్స్‌, ఎగ్ పరాటా, ఓట్స్ ఇడ్లీ, పెస‌ర‌ట్టు, పీన‌ట్ మ‌సాలాలో కంటికి అవసరమయ్యే ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.