శీతాకాలంలో వీటిని తీసుకుంటే సమస్యలు దూరం..

06 December 2023

అందుబాటులో ఉండే వివిధ రకాల పండ్లతో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్‌-సి అధికంగా ఉండే నారింజ లాంటి నిమ్మజాతి పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి.

నిమ్మజాతి పండ్లు తినడం ద్వారా చలికాలపు రుగ్మతలైన జలుబు, ఫ్లూ నుంచి రక్షించుకోవచ్చు.

ఫైబర్‌ సమృద్ధిగా ఉండే యాపిల్‌ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు కలుగుతుంది. యాపిల్‌లో విటమిన్లు, మినరల్స్‌ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

ఏడాదంతా అందుబాటులో ఉండే అరటిలో పొటాషియం అధికంగా దొరుకుతుంది. త్వరగా శక్తి లభిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ల అధికంగా ఉండే దానిమ్మను పండుగా తిన్నా, సలాడ్లు, యోగర్ట్‌తో కలిపి తీసుకున్నా ఎంతో ఆరోగ్యం.

విటమిన్‌-సి, కె, ఫైబర్‌తో కూడిన కివీ పండులో పోషకాలు అధికం. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. చలి బారినుంచి రక్షణ లభిస్తుంది.

ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగుల్లో దొరికే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం