ప్రస్తుతం కాలం లో చిన్నవారిని నుండి పెద్దవారి వరకు అందరు ఎదుర్కొంటున్న సమస్యల్లో మధుమేహం సమస్య కూడా ఒకటి.
మధుమేహం అంటే శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినా కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.
ఉదయం పూట ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉందయమనే కాదు రోజులో ఏ సమయంలో కనిపించినా కాస్త జాగ్రత్త పడాల్సిందే.
మార్నింగ్ లేవగానే తీవ్రమైన తలనొప్పి, చెమట పట్టడం. మన శరీర చర్మం పాలైనట్లు మారడం. చూపు మసకబారినట్లు ఉండడటం.
ఉదయం నిద్రలేచాక నోరు పొడిబారడం. అలసట, నీరసం, తల తిరుగుతున్నట్లు అనిపించడం. నాడి వేగంగా కొట్టుకోవడం.
తగినంత నిద్రపోయినా కూడా మార్నింగ్ అలసటగా అనిపించడం. విపరీతమైన ఆకలిఉండటం.. గాయాలు త్వరగా మానకపోవడం.
తరచుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.