ఈ సమస్యలు ఉన్నాయా.? దానిమ్మ జోలికి వెళ్లకండి..

TV9 Telugu

16 March 2025

దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది. దానిమ్మలో విటమిన్ కె, సి, బి, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేస్తాయి.

దానిమ్మ తింటే శరీరానికి ఐరన్ పుష్కలంగా లబిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య ఉండదు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దానిమ్మ.. పండు, తొక్క, గింజలు, పూలు అన్నీ పోషకాలను ఇచ్చేవే. కానీ కొంతమందికి హాని కలిగిస్తుంది. దానిమ్మ ఎవరికి హానికరమో తెలుసుకుందాం.

రక్తపోటు తక్కువగా ఉంటే దానిమ్మ తినకూడదు. దీని ప్రభావం చల్లగా ఉంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణ వేగం మందగించవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మను తినకూడదు. ముఖ్యంగా హై షుగర్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

శరీరంలో ఎసిడిటీ సమస్య ఉంటే దానిమ్మ తినకూడదు. దీని చల్లని స్వభావం కారణంగా, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు.

స్కిన్ అలర్జీ విషయంలో దానిమ్మపండు తినకుండా ఉండాలి. దీన్ని తీసుకోవడం వల్ల అలర్జీ సమస్య మరింత పెరుగుతుంది.

దానిమ్మపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే దీన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.