చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే మీ ఆరోగ్యం పదిలం..
31 October 2023
చలికాలమే కాదు ఏ కాలంలోనైనా ఉదయం వర్కౌట్స్ చేస్తేనే మన శరీరం హుషారుగా ఉంటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
ఇక్కడ తెలిపిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చలికాలంలోనే ఎక్సర్‌సైజ్ చేయడం అనేది ఏమంత ఇబ్బంది అనిపించదు.
ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయమే రన్నింగ్, వాకింగ్ వంటి వర్కౌట్స్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు.
చల్లని వాతావరణంలో వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల సాధారణ సమయంలో కన్నా ఎక్కువ కేలరీలు ఖర్చవడం వల్ల బరువు తగ్గుతారు.
చలికాలంలో ఇష్టం లేకున్నా నీరు తాగడం వల్ల శరీరంలో నీటి నిల్వలు పడిపోకుండా కాపాడుకోవచ్చు. లేదంటే శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
బాడీలో నీరు లేక డీహైడ్రేట్‌కు గురయ్యారంటే చర్మం పొడిగా మారుతుంది. అలసట, తలనొప్పిగా వంటి సమస్యలు తలెత్తుతాయి.
చలికాలంలో రక్త ప్రసరణ తగ్గి శరీరం గడ్డకట్టినట్టు అయిపోతుంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచే బట్టలు ధరించి వర్కౌట్స్ చేస్తుండాలి.
ఉదయం చలి సమయంలో వర్కౌట్స్ చేయడం సాధ్యపడనప్పుడు లంచ్ బ్రేక్‌లోనైనా చేయడం అలవాటు చేసుకోవాడం ఎంతో మంచిది.
చలికాలంలో ప్రతిరోజూ కొన్ని యోగాసనాలు, ధ్యానం చేయడం ద్వారా కూడా శారీరక, మానసికంగా ఉల్లాసంగా ఉంచుకొవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి