చలికాలంలో ముఖ్యంగా పేగులను మెదడు సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చలి వల్ల రోగనిరోధక శక్తి పడిపోతుంటుంది.
పోషకారహర నిపుణులు సూచించిన పలు ఆహార నియామాలు పాటిస్తే రోగనిరోధక వ్యవస్ధను కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే సీజనల్ సమస్యలను అరికట్టవచ్చు.
గుమ్మడికాయలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయతో చేసిన వంటకాలను తినడం ఎంతో మేలని సూచిస్తున్నారు.
ఫైబర్, విటమిన్స్‌తో నిండిన యాపిల్స్ తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగే విధంగా చూసుకోవాలి. ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉండే గుమ్మడి, యాపిల్స్ తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
పెరుగు, మజ్జిగలో ప్రొబయాటిక్స్ అధికంగా ఉంటాయి. పెరుగు మజ్జిగ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధ మెరుగై సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తుంది.
గుమ్మడికాయ,ఆపిల్ పండ్లు, పెరుగు, మజ్జిగతో పాటు వాల్‌నట్స్, పాలకూర, బెర్రీస్, అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివీ ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి.