రోజూ కాఫీ తాగితే ఆ సమస్యలు దూరం..
TV9 Telugu
22 January
202
5
కాలు కదపకుండా ఎక్కువ సేపు అదే పనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ అలెర్ట్’లో ప్రచురితమయ్యాయి.
కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ, రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందట.
10 వేల మందిలో కొందరికి కాఫీ ఇచ్చి కొందరికి ఇవ్వక జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
నిశ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉండేవారిలో హృద్రోగ సమస్యలతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు.
ఎక్కువసేపు కూర్చుని ఉండి కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల ముప్పు తగ్గినట్లు గుర్తించారు.
అయితే అధికంగా కాఫీ తాగడం ప్రమాదం. దీనిలోని కెఫైన్ అనే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే మోతాదులో తీసుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ట్రైన్లో వెళ్తున్నారా..? వాట్పాప్లో ఈ 3 నెంబర్లు సేవ్ చేయండి!
రిపబ్లిక్ డే స్పీచ్ కోసం ఇవి బెస్ట్ పాయింట్స్..
వాహనాలతో నిమ్మకాయ తొక్కించడం వెనుక సైన్స్..