ఇలా చేస్తే మూలశంఖ సమస్య నుంచి ఊరట.. 

TV9 Telugu

12 August 2024

పురీషనాళం చుట్టూ ఉండే రక్తనాళాల్లో హెమరాయిడ్స్(పైల్స్) సమస్య ఏర్పడుతుంది. క్రమరహిత ఆహారమే దీనికి ప్రధాన కారణం అని వైద్యులు చెబుతున్నారు.

హేమోరాయిడ్స్(పైల్స్) రెండు రకాలు. రక్తనాళాల వాపు అంతర్గత హేమోరాయిడ్లలో కనిపించదు, కానీ బాహ్య హేమోరాయిడ్లలో ఇది పాయువు వెలుపల కనిపిస్తుంది.

ఈ వ్యాధికి ప్రధాన కారణం.. క్రమరహితమైన దినచర్య, ఆహారం. ఊబకాయం, మలబద్ధకం, మితిమీరిన లైంగిక సంపర్కం, ప్రేగులో ఒత్తిడి, చెడు జీవనశైలి దీనికి కారణాలు.

దురద, పురీషనాళం దగ్గర నొప్పి, మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం ఉంటుంది. హెమోరాయిడ్లను వదిలించుకోవడానికి హోమ్ రెమిడీస్ ఉన్నాయి.

గోరువెచ్చని నీటితో స్నానం చేసి, ఒక ప్లాస్టిక్ టబ్‌లో గోరువెచ్చని నీటిని పోయాలి. అందులో కాసేపు కూర్చోవాలి. తద్వారా ఆ ప్రాంతం మెత్తబడి నొప్పి తగ్గుతుంది.

హేమోరాయిడ్స్‌ సమస్యతో బాధపడేవారు 2-3 అత్తి పండ్లను వేడి నీళ్లతో కడిగి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

రెండు లీటర్ల మజ్జిగలో యాభై గ్రాముల జీలకర్ర మిక్స్ చేసి, దాహం వేసినప్పుడల్లా ఈ మిశ్రమాన్ని నీటికి బదులు తాగండి. సమస్య దూరమవుతుంది.

ఫైల్స్ సమస్యతో బాధపడేవారు.. ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల నొప్పి క్రమంగా తగ్గుతుంది. సమస్య నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది.