రన్నింగ్, డైట్ కంట్రోల్ లేకుండానే స్లిమ్‌గా కనిపించడం ఎలా..?

TV9 Telugu

27 March 2024

ప్రతి ఒక్కరూ స్లిమ్‌గా కనిపించాలని కోరుకుంటారు. ఫిట్‌గా ఉండేందుకు రెగ్యూలర్‌గా వాకింగ్, వ్యాయామం చేస్తుంటారు.

దీని కోసం చాలామంది ప్రజలు జిమ్‌లో చాలా గంటల తరబడి గడుపుతారు. అయినా కూడా అస్సలు బరువు తగ్గలేకపోతున్నారు.

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ప్రజలు మాత్రం జిమ్, వ్యాయామం వంటివి లేకుండా కూడా సన్నగా కనిపిస్తారు.

మీరు కూడా ఎలాంటి వారిలానే శ్రమ లేకుండా సన్నబడాలంటే మేము చెబుతున్న ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి చాలు.

పిండితో చేసిన తినుబండరాలు తినడం మానుకోండి. మీ ఆహారంలో తాజా పండ్లను చేర్చుకోండి. అప్పుడు సులభంగా బరువు తగ్గవచ్చు.

చక్కెరకు సంబంధించి కూల్ డ్రింక్స్, కాండీస్, చాక్లెట్స్ వంటి ఫుడ్స్ ను తీసుకోవడానికి పూర్తిగా దూరంగా ఉండండి.

మాంసాహారాలను తీసుకోవడం తగ్గించాలి. వాటి స్థానంలో ఆకుపచ్చ కూరగాయలు తినడాన్నిపెంచుకోవాలి. ఇలా చేస్తే స్లిమ్‌గా కనిపిస్తారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంతోపాటు ఆరోగ్యానికి హాని కలిగించే జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.