హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు సీపీఆర్ ఎలా చేయాలంటే..
07 December 2023
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ మరణాలు పెరిగిపోతున్నాయి. అయితే ఎవరికైనా హార్ట్ ఎటాక్
వచ్చినప్పుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేస్తే, ఆ వ్యక్తిని రక్షించవచ్చంటున్నారు నిపుణులు
అయితే చాలా మందికి సీపీఆర్ ఎలా చేయాలో ఇప్పటికీ తెలియదు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియకపోవడం వల్ల బాధితుడికి నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తుంటారు
నిజానికి అలా చేయకూడదు. పేషెంట్ స్పృహలో లేనప్పుడు నీళ్లు తాగిస్తే ఆ నీళ్లు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చు
నిజానికి.. ఎవరైనా గుండె పోటుకు గురైనప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారికి వెంటనే సీపీఆర్ చేయాలి. అనంతరం వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి
కార్డియో పల్మరీ రిసస్కిటేషన్‌ను సీపీఆర్ అని అంటారు. తొలుత పేషెంట్‌ను చదునైన ప్రాంతంలో వెల్లకిలా పడుకోబెట్టాలి. అతనిలో ఎలాంటి కదలిక లేకపోతే వెంటనే పల్స్ చూడాలి
మేజర్ హార్ట్ ఎటాక్ అయితే పల్స్ దొరకదు. అప్పుడు మెడ వద్ద పల్స్ చూడాలి. ఒక వేళ అక్కడ కూడా పల్స్ దొరకలేదంటే హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించాలి.
అప్పుడు వెంటనే చేతితో పేషెంట్
ఛాతీ (గుండె మీద కాదు) మధ్య భాగంలో ప్రెస్
చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్కా కుండా స్ట్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి
ఛాతీని కనీసం 5 సెంటీమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేస్తుండాలి. తర్వాత పల్స్ చెక్ చేయాలి.
పల్స్ దొరకకపోతే పేషెంట్ ముక్కు మూసి.. అతని నోటిలోకి నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత మళ్లీ సీపీఆర్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుంది