శీతాకాలంలో ఎన్ని గ్లాసుల నీరు తీసుకోవాలి.. ఎలా తాగితే మంచిది..?

1st November 2023

శీతాకాలం ప్రారంభమైంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు తక్కువ నీటిని తీసుకుంటారు. అలాగే చలికాలంలో దాహం వేయదు.. కావున ఎక్కువ నీరు తాగరు. 

శీతాకాలం ప్రారంభం

కానీ శరీరంలో తగినంత నీరు ఉండటం చాలా ముఖ్యం. చలికాలంలో ఎక్కువ నీరు తాగకపోవడం వల్ల అనేక సమస్యలను తలెత్తుతాయి. 

చాలా ముఖ్యం..

చలికాలంలో ప్రతి ఒక్కరూ పొడి చర్మంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా అలెర్జీ సమస్యలు కూడా మొదలవుతాయి.

పొడి చర్మంతో ఇబ్బందులు

చలికాలంలో రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తాజాగా ఉండటానికి సహాయపడుతుంది. 

పది గ్లాసుల నీరు..

చలికాలంలో మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మూడు లీటర్ల నీరు తాగడం అవసరం.. అందుకే ఈ కాలంలో నీరు తాగడంపై దృష్టిపెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

కనీసం మూడు లీటర్లు..

ఇంకా శారీరానికి తగినట్లు తగినంత నీరు తాగడం కూడా ముఖ్యమని గుర్తించాలి. అలాగే చలికాలంలో చల్లటి నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీటిని తాగితే మంచిది.

గోరు వెచ్చని నీరు..

మీ శరీరంలో నీరు తగినంత లేకుంటే మీ శరీరం బలహీనంగా మారుతుంది.  తక్కువ నీరు తాగితే అది మన శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది.

తగినంత నీరు లేకుంటే 

తక్కువ నీరు తాగడం వల్ల మన శరీరానికి సరైన ఆక్సిజన్ అందదు. డీహైడ్రేషన్, అలసట, కిడ్నీ సమస్యలు. కావున ఎక్కువ నీరు చాలా అవసరం.

నీరు చాలా అవసరం..