రోజులో ఎన్ని టీలు తాగాలంటే..

TV9 Telugu

23 June 2024

రోజుకు 10-12 కప్పుల టీని సులభంగా తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. మరిందరు రోజంతా 2 నుంచి 3 కప్పుల టీని తీసుకుంటారు. అయినప్పటికీ ఇది కూడా ప్రమాదమే.

టీ ఆకుల్లో కేలరీలు ఉండవు. గ్రీన్ టీ, బ్లాక్ టీలను వేడి నీళ్లలో కలిపితే తక్కువ మొత్తంలో కేలరీలు ఉత్పత్తి అవుతాయి.

250 ml టీలో కూడా 3 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందుకు బదులుగా టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

టీలో పాలు కలిపినప్పుడే దాని క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది. పాలతో టీ తాగే అలవాటు మీ బరువును పెంచుతుంది.

పాలతో కలిపిన టీలో క్యాలరీ కంటెంట్ 5 నుంచి 30 కేలరీలు పెరుగుతుంది.అందుకే ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.

మీరు బరువు తగ్గాలని అనుకుంటే.. పాలతో కూడిన టీకి బదులుగా.. లైకోరైస్ టీ తాగడం ద్వారా బరువు పెరగడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

చక్కెరతో టీ తాగడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. ఇది మంచి రుచిగా ఉంటుంది. కానీ ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించదు.

మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీరు గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగవచ్చు. క్యాలరీలు తక్కువగా ఉన్నందున.. అవి యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌తో నిండి ఉంటాయి.