కంటి దురద కోసం ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి

24 October 2023

కళ్లలో దుర, మంట వంటి సమస్యలు ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలకు చాలా అంతరాయం కలిగిస్తాయి. ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది

కళ్లు దురద

ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు మీరు ఎలాంటి హోమ్‌ రెమెడీస్‌ చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

హోమ్‌ రెమెడీస్‌

టీ బ్యాగ్‌ని వేడి నీటిలో ముంచి కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మీ కంటి మీద ఉంచండి. దీని వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

టీ బ్యాగ్‌

కాటన్‌ బాల్‌ సహాయంతో మీ కనురెప్పలపై అలోవెరా జెల్‌ను అప్లై చేయండి. కాసేపు అలాగే వదిలేయండి. మంచి ప్రయోజనం ఉంటుంది.

అలోవెరా జెల్‌

రోజ్‌ వాటర్‌లో కాటన్‌ బాల్‌ లేదా ప్యాడ్‌ను నానబెట్టి, మీ మూసిన కన్నురెప్పలపై ఉంచండి. దీని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

రోజ్‌ వాటర్‌

కళ్లలోఏదైనా మంట నుంచి ఉపశమనం పొందడానికి దోసకాయను ముక్కలుగా కట్‌ చేసి మీ కళ్లపై ఉంచండి. మంచి రిలీఫ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దోసకాయ ముక్క

మీ కంటి సమస్యల కోసం ఇలాంటి హోమ్‌ రెమెడీస్‌ను వాడటం  మంచిది. దీని వల్ల మంచి ఉపశమనం  కలుగుతుంది.

హోమ్‌ రెమెడీస్‌

అందుకే కంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంటి చిట్కాలు చేయకుండా మీ ఇష్టానుసారంగా  మందులు వాడినా ప్రమాదమే.

కంటి సమస్య పట్ల జాగ్రత్త