పెదాలకు ఇవి రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి
09 December 2023
కొబ్బరి నూనె, తేనెలో పంచదార కలిపిన మిశ్రమాన్నిపెదవులపై స్క్రబ్‌గా వాడటం ఉత్తమం. దీనివల్ల గులాబీ రంగులోకి మారుతాయి.
ఇలా తరుచూ చేయడంతో పెదవుల చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి పెదాలను మృదువుగా మార్చి, మంచి రంగు తెస్తుంది.
రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ వాడే వాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. వీరు బయటి నుంచి రాగానే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి.
విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి మంచి రెమెడీగా పనిచేస్తాయి. విటమిన్ ఈ అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి.
పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి.
స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి.
మీ పెదవులు మృదువుగా మంచి రంగులోకి రావాలంటే తరుచూ పెరుగు అప్లై చేస్తే చాలు. దీనివల్ల గులాబీగా మారుతాయి.
నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారడానికి మంచి రెమెడీస్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి