విపరీతంగా జుట్టు ఊడుతుందా ?? ఈ హోమ్ రెమిడీస్ తో చెక్ పెట్టండి

TV9 Telugu

29 June 2024

ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవారి దాకా అందరు ఎదుర్కునే సమస్య జుట్టురాలడం. దాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుంటారు.

అయితే మనం ఇంట్లో దొరికే సహజ పదార్థాలను వాడటం వల్ల కూడా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కెరాటిన్ విటమిన్ బి, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు కురులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

కనీసం నాలుగు నిమిషాలపాటు ప్రతిరోజు తల మసాజ్ చేసుకోవడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

కలబంద సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల పొడిబారిన వెంట్రుకల కారణంగా వచ్చే చెమట, దురద కారణంగా వచ్చే చికాకుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఎగ్స్ ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇందులో ఉండే బయోటిన్ ఫోలేట్ విటమిన్ ఏ, విటమిన్ డి తోపాటు ఇతర పోషకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి. 

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టు కుదుళ్లను ఉత్తేజం చేసి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వారంలో ఒక్కసారైనా తలకు గ్రీన్ టీ పట్టించి తలస్నానం చేయండి.