వీటితో ఇలా చేస్తే కంటి అలసట దూరం..
TV9 Telugu
23 August 2024
ప్రస్తుత కాలంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్‌పై నిరంతరం పని చేయడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి.
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు ఉపయోగించడం వల్ల కళ్లలో నొప్పి సమస్య కూడా వస్తుంది. వీటిని విస్మరిస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది.
మీ కళ్లు అలసిపోయినట్లు అనిపిస్తే పచ్చి బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది కళ్ల చికాకు, అలసటను తగ్గిస్తుంది.
దీన్ని ఉపయోగించడానికి బంగాళాదుంపను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీ కళ్లపై కాసేపు ఉంచండి. దీంతో కంటి అలసట తగ్గుతుంది.
కంటి అలసట, బలహీనతను తొలగించడానికి రెండు దోసకాయ ముక్కలను తీసుకోని మీ కళ్లపై ఉంచి కొంత సమయంపాటు విశ్రాంతి తీసుకోంటే కంటి అలసట తగ్గుతుంది.
కంటి అలసటను తొలగించడానికి చల్లని పాలను ఉపయోగించండి. ఇది కళ్లలో ఉండే ఇన్ఫెక్షన్, అలసటను తొలగిస్తుంది.
దీన్ని ఉపయోగించడానికి పాలలో పత్తిని ముంచండి. ఇప్పుడు దాన్ని పాచ్ చేసి కళ్లపై పెట్టుకోవాలి. ఇది మీ అలసటను తగ్గిస్తుంది.
అలోవెరా జెల్ కంటి అలసటను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అలోవెరా జెల్‌ను కళ్లపై కొంత సమయం పాటు ఉంచితే అలసటను దూరం చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి