ఇలా చేస్తే పంటినొప్పి దూరం..

23 September 2023

పంటి నొప్పి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? మాట్లాడాలన్నా, ఏదైనా తినాలన్నా ఇబ్బందిగా ఉందా? దంతాలలో కావిటీస్ లేదా చిగుళ్ల వ్యాధి కారణం.

పంటి నొప్పికి వంటింట్లో పోపుల డబ్బాలో లభించే పదార్థాలతో నయం చేసుకునేలా కొన్ని సులువైన చిట్కాలను ఫాలో అవ్వండి, రిలీఫ్‌ పొందండి.

లవంగంలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది క్రిమినాశకంగా పనిచేస్తుంది, లవంగం లేదా లవంగ నూనె పంటి నొప్పిని తగ్గిస్తుంది.

పుదీనా ఆకుల్లో మెంథాల్ అనే సహజ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీనిని వాడడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

కొబ్బరి  నూనెలో ఆరు చుక్కల పిప్పరమెంట్ ఆయిల్ కలిపి ఈ నూనెలో దూదిని ముంచి నొప్పి ఉన్న పంటిపై  రాయండి.

ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ ఉప్పు కలపండి. దీనిని నోటిలో వేసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించండి. దీంతో పంటి నొప్పి దూరమవుతుంది

నేరేడు పండుతో పంటి నొప్పి, నోటి దుర్వాసన దూరమై చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉండడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

లేత వేపాకులను కొద్దిగా నిమిలి తినాలి. దీని వల్ల పంటి నొప్పి, దంత, చిగుళ్ళ సమస్యలతో పాటు, నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.