చలికాలంలో చిన్నారుల్లో కఫం సమస్యకు వీటితో చెక్..

19 December 2023

TV9 Telugu

చలికాలంలో చిన్నారుల్లో జలుబుతో పాటు, ఛాతిలో కఫం పేరుకుపోతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

సకాలంలో చికిత్స అందించకపోతే ఈ వ్యాధి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కఫం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారితే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా భావించాలని చెబుతున్నారు నిపుణులు.

భారతదేశంలో ప్రతి వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో కఫం సమస్యకు సహజంగా చెక్‌ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

చిన్నారుల్లో కఫం సమస్యను తగ్గించడంలో ఆవ నూనె ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆవనూనెతో ఈ సమస్య ఉన్న చిన్నారుల ఛాతీపై మసాజ్‌ చేయడం వల్ల కఫం కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే ఆవనూనెలో వెల్లుల్లిని కలిపి కఫం సమస్య ఉన్న చిన్నారుల ఛాతీపై మసాజ్‌ చేస్తే మెరుగైన ఫలితం పొందవచ్చు.

పాలను గోరువెచ్చగా వేడి చేసి అందులో కొద్దిగా పసుపు కలిపి పిల్లలకు తాగించినా కూడా కఫం సులభంగా కరిగిపోతుంది.