జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకూడదు అనేది అపోహ మాత్రమే. అన్ని చర్మ రకాల వారికీ మాయిశ్చరైజర్ అవసరం.
చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి. ఎందుకంటే స్కిన్ హైడ్రేషన్‌గా ఉంటుంది.
అయితే ముఖం మరింత జిడ్డుగా మారడానికి సరైన మాయిశ్చరైజర్‌ని వాడకపోవడమే కారణం. వీరు ఎలాంటి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలో తెలుసుకుందాం.
నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ చర్మాన్ని జిడ్డుగా మార్చదు. చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది.
ఎన్నో ఫేమస్ బ్రాండ్ల మాయిశ్చరైజర్లు చర్మం అదనపు నూనెను గ్రహించేలా చేస్తాయి. ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మొటిమలను కూడా అదుపులో ఉంచుతుంది.
అదేవిధంగా.. లాక్టిక్ ఆమ్లం/ గ్లైకోలిక్ ఆమ్లం జిడ్డు చర్మానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇవి తేమను నిలుపుకోవటానికి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడతాయి.
జిడ్డు చర్మంతో బాధపడేవారు విటమిన్ సి సీరమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
ఇది మొటిమల సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. విటమిన్ సి సీరమ్‌ను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.