సోషల్ మీడియా ముంచేస్తోంది... ఒత్తిడి చంపేస్తోంది...
08 September 2023
యువకులు దైనందిన జీవితంలో చోటు చేసుకుంటున్న సవాళ్లను అదిగమించడానికి తమ తమ లైఫ్ స్టైల్ చేసుకుంటున్న మార్పులు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతున్నాయి.
చదువు లేదా పని ఒత్తిడిలో భాగంగా ఎక్కువ శాతం యువత తక్కువ టైమ్‌లో భుజించడానికి జంక్ ఫుడ్ వంటి అనారోగ్య ఆహారాన్ని తింటున్నారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటుంది.
కంప్యూటర్లు, ఫోన్‌ల కారణంగా కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాటి మనుషులతోటి సంఘటితంగా మెలిగే అవకాశాన్ని కోల్పోతున్నారు.
దీని ఫలితంగా ఇతరులతో ముభావంగా ఉండటం, ఏం మాట్లాడితే ఇతరులు ఏమనుకుంటారో అనే ఆందోళన దోరణి పెరిగిపోతుంది.
క్యూరేటెడ్, తరచుగా తప్పుదారి పట్టించే ఆన్‌లైన్ కంటెంట్ బారిన పడటం ఆందోళన చెందాల్సిన విషయం. నిరాశ, ఆత్మనూన్యతా భావం బారిన పడే ప్రమాదం ఉంది.
చదువు పరంగా, వృత్తి పరంగా రాణించాలనే ఒత్తిడి పెరిగి, ఆరోగ్యం క్షీణించడానికి గణనీయంగా దోహదపడుతుంది.
తీవ్రమైన పోటీ, సుదీర్ఘమైన పని గంటలు, టార్గెట్స్, విపరీతమైన ఒత్తిడి బర్న్‌అవుట్‌ను సృష్టిస్తాయి, నిద్రలేమి మరియు దీర్ఘకాలిక అలసటకు కారణమవుతోంది.
ప్రపంచానికి తనను తాను గొప్పగా నిరూపించుకోవడానికి కీలకమైన జీవిత నిర్ణయాలు తీసుకోవాలనే ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.