20 September 2023

ఈ కూరలతో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టేయండి

Pic credit - Instagram

ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచం లో డైట్ ను  సరిగ్గా పాటించని పరిస్థితి ఉంది.  దీని వల్ల శరీరంలో అనేక లోపాలు ఏర్పడుతున్నాయి.

వీటిలో రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఒకటి. కొన్ని కూరగాయలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.. అవేంటో తెలుసుకుందాం.

మనకు చిలకడదుంప చలికాలం లో ఎక్కువగా లభిస్తుంది. ఈ దుంపలో  విటమిన్ సి అధిక మొత్తం లో ఉంటుంది. అందువలన దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

అధిక రక్త హీన సమస్య ఉన్నవారు పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ప్రతిరోజూ తీసుకోవడం వల్ల  ఎనీమియా సమస్య ఉండదు.

ఆనపకాయ లో ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకుంటే రక్త హీనత సమస్య తగ్గిపోతుంది.

 క్యాబేజ్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, టమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువ లభిస్తాయి. దీన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు బీట్‌రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్  ఐరన్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.