25 September 2023
బీ అలర్ట్.! వర్షాకాలం ఏసీ వాడుతున్నారా..?
కాలం మారే కొద్దీ ఎయిర్ కండీషనర్ వాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
ఇళ్ళు, ఆఫీసులు, వాహనాలు.. ఇలా ప్రతి చోట ఏసీలు ఇంపార్టెంట్ అప్లియన్స్‌గా మారిపోయింది.
వర్షాకాలంలో ఏసీలను సరిగా మెయింటెన్ చేస్తేనే ఎక్కువ రోజులు పని చేస్తాయంటున్నారు నిపుణులు.
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువ. ఇలాంటి సమయంలో ఎక్కవు డ్రై మోడ్‌లో ఏసీని వాడుకోవాలి. సందర్భాన్ని బట్టి కూల్,హీట్,ప్యాన్ వాడుకోవాలి.
వర్షాకాలంలో విద్యుత్ కట్ ఎక్కువ. వోల్టేజ్‌లోని హెచ్చుతగ్గులను కంట్రోల్ చేసేందుకు వోల్టేజ్ స్టెబిలైజర్ వాడకం తప్పనిసరి
ఏ సీజన్‌లోనై ఏసీ ఫీల్టర్లను క్లీన్ చేసుకోవాలి.. ముఖ్యంగా వర్షాకాలంలో నెలకు రెండు సార్లు ఫీల్టర్లను మార్చుకోవాలి.
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఆరోగ్యానికి మంచిది. అందుచేత ఎక్కువగా ఫ్యాన్‌ను ఉపయోగంచుకోవడం మంచిందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.
వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు వస్తాయి. అలాంటి సమయాల్లో తప్పకుండా ఏసీ పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి.
వర్షాకాలంలో గాలి, దుమ్ము, దూళి పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఔట్‌డోర్ యూనిట్, దాని పరిసరాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏవైనా సమస్యలు వస్తే టెక్నిషియన్‌కు కాల్ చేయాలి. భవిష్యత్‌లో అది ఏసీ యూనిట్‌కు పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఎక్కువ.
ఇక్కడ చెయ్యండి