శరీరాన్ని వ్యాయామం ముఖ్యమా.. లేక నిద్ర..
09 October 2023
హైబీపీ, షుగర్, క్యాన్సర్ల వంటి జబ్బుల నుంచి తప్పించుకోవడానికి లేక జబ్బు ముదరకుండా ఉండటానికి వ్యాయామం ఎంతో అవసరం.
అయితే వ్యాయామం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. కంటి నిండా నిద్ర కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
వృద్దాప్యం సమీపిస్తున్న కొద్దీ విషయాలను గ్రహించడంలో తడబడుతూ ఉంటారు. క్రమపద్దతిలో వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం లేక శారీరక శ్రమ చేయడం వలన రక్త ప్రసరణ సాఫీగా సాగి, మెదడూ చురుకుగా పని చేస్తుంది.
అయితే రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే మధ్య వయసువారికి వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువే అంటున్నారు.
సరిగా నిద్రపోకపోవడం వల్ల మెదడు పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందని అధ్యయనకారులు తేల్చారు. అధ్యయన నివేదికను లాన్సెట్ పత్రికలో ప్రచురించారు.
శారీరకంగా చురుకుగా ఉన్నప్పటికీ తక్కువ సేపు నిద్రించేవారిలో విషయ గ్రహణ సామర్థ్యం వేగంగా మందగిస్తున్నట్టు పరిశోధకులు నివేదించారు.
చదవటం, నేర్చుకోవటం, గుర్తుంచుకోవటం, ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం, కార్యకారణ వివేచన, ఏకాగ్రత వంటివాటిపై ఎఫెక్ట్ పడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి