ఈ పండ్లు కన్పిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు..పుష్కలమైన పోషకాలు..
Jyothi Gadda
08 April 2024
సాధారణంగా కొన్ని రకాల పండ్లు కొన్ని సీజన్ లలో మాత్రమే మనకు లభిస్తాయి. అందుకే ఏ సీజన్‌లో లభించే పండ్లు ఆ సీజన్‌లో తప్పక తినాలని చెబుతుంటారు. వీటిని తింటే మన శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి.
ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మామిడి పండ్లతో పాటుగా మోర్రిపండ్లు కూడా ఎంతో ఫెమస్. మోర్రి పండ్లలో పుష్కలమైన ఆరోగ్యలాభాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. మోర్రీ పండ్లు చూసేందుకు చిన్నగా నల్లగా ఉంటాయి.
ఇవి కాయలుగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లోను, పండిన తర్వాత మాత్రం నల్లగా ఉంటాయి. వీటి స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఉగాది, శ్రీరామనవమి ఆకాలంలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇవి అడవుల్లోనే దొరుకుతాయి.
మోర్రిపండ్ల శాస్త్రియనామం బుంచనానీయా లాటిఫొలియా. దీన్ని చిరోంజి పండు అని కూడా పిలుస్తుంటారు. ఇది మన శరీరంలోని ఇమ్యునిటీని పెంచుతుంది. చర్మం హెల్తీగా ఉండటంలో ఉపయోగపడుతుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోను, బెల్లీఫ్యాట్ ను తగ్గించడంలోను ఉపయోగపడుతుంది. మౌత్ అల్సర్ లను తగ్గిస్తుంది. శరీంలో కొందరు అధిక వేడితో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఉపశమనం కల్గిస్తుంది.
శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. తెల్లని వెంట్రులకను నల్లగా మారేలా చేస్తుంది. ఉదర సంబంధం వ్యాధులను దూరం చేస్తుంది. శరీంలో నుంచి చెడు పదార్థాలను బైటకు విసర్జితమయ్యేలా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
మోర్రీ పండ్రలు రుచికి ఎంతో తియ్యగా ఉంటాయి. మోర్రిపండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇవి డ్రైఫ్రూట్స్ తో సమానంగా మనశరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయి. శరీరానికి విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.
అందుకే చాలా మంది సమ్మర్ లో దీన్ని అస్సలు తినకుండా వదలోద్దు. దీని జ్యూస్ కూడా తాగితే మనశరీరానికి పుష్కలమైన మినరల్స్, విటమిన్లు లభిస్తాయి. ఇదర పండ్ల మాదిరిగా మోర్రి పండ్లు అన్ని కాలాల్లోకూడా లభించవు.