రోజూ కొంతసేపు ఎండలో తిరిగితే ఎన్నో లాభాలు..

19 September 2023

సూర్యుని నుండి లభించే ఉత్తమ పోషకాల్లో ఒకటి విటమిన్ డి. ఎండలో మనం ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

ఎండ ఉన్న ప్రదేశాల్లో ఉన్నవారికి విటమిన్ డి లోపం ఉండదు. సూర్యుని నుండి లభించే ఎండ మనం ఆహారం ద్వారా తీసుకున్నదానికంటే రెండు రెట్లు ఎక్కువ.

విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ . కాల్షియం శోషణకి చాలా ముఖ్యమైంది. విటమిన్ డి ఆరోగ్య కణాల పెరుగుదలకు సహకరిస్తుంది.

ఎముకల బలంగా మారతాయి. వయసు ఎక్కువగా ఉన్నవారిలో బోలు ఎముకల సమస్య నుంచి కాపాడుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది.

రోజుకి 4000 IU విటమిన్ డి తీసుకోవడం అవసరమని నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్‌ చెబుతుంది. దీని కోసం ఎండ మాత్రమే సరైన మార్గం.

వృద్ధాప్యం తర్వాత శరీరంలో విటమిన్ డి సహజంగా తగ్గుతుంది. అలాంటప్పుడు రోజూ ఎండలో కొంతసేపు ఉంటె విటమిన్ డి లోపాన్ని దూరం చెయ్యవచ్చు.

రోజువారీ విటమిన్ డి కోసం కేవలం 8 నుంచి 15 నిమిషాల వరకూ ఎండలో ఉంటే చాలు. ముదురు రంగు ఉన్నవారికి ఎక్కువ సమయం పడుతుంది.

15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఎండలో ఉండొద్దు. వీటితో పాటు సోయా పాలు, బాదం పాలు, నారింజరసం, ధాన్యాలు, పెరుగు, సోయా టోఫు వంటి ఫుడ్స్‌ తీసుకోవాలి.