ప్రతి రోజు 15-30 నిమిషాలు నడవడం వల్ల మెదడు పనితీరు మెరుగై స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంతే కాదు అల్జీమర్స్, డైమెన్షియా వంటి మతిమరపు సమస్యలను కూడా దూరం చేస్తుంది.
నడక వల్ల కంటిపై ఒత్తిడి కంటి చూపు మెరుగుపరుస్తుంది. కంటి చూపు కోల్పోవటానికి కారణమయ్యే గ్లకోమాను అడ్డుకుంటుంది.
ప్రతిరోజు నడక వల్ల రక్త సరఫరా మెరుగు పరచి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాలను తగ్గించి బీపీ అదుపులో ఉంచుతుంది.
నడక ద్వారా మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్‌ను అందేలా చేస్తాం. ప్రతి రోజు నడవడం వల్ల ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.
డయాబెటిస్ సమస్య ఉన్నవారికి నడక చాలా మంచిది. పరుగెత్తే వారి కంటే నడిచే వారికే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటున్నాయి అని పరిశోధనలో తేలింది.
ప్రతి రోజు నడక వల్ల కడుపులో పేగులు కదలికలు జరిగి జీర్ణక్రియ మెరుగవుతుంది. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
ప్రతి రోజు కనీసం 10వేల అడుగులు వేయడం వల్ల బాడీలో ఫ్యాట్ తగ్గి కండరాలు మరింత ఆరోగ్యంగా బలంగా మారతాయి.
ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాలు నడవాలని ఆర్థరైటిస్ ఫౌండేషన్ సూచిస్తోంది. నడక ద్వారా కీళ్ల నొప్పులు తగ్గి బలంగా మారతాయి.