తెల్ల ఉల్లిగడ్డతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

TV9 Telugu

17 January 2024

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. మన మార్కెట్‌లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా లభిస్తుంటాయి.

ఏ రంగు ఉల్లిపాయలు తింటే ఎక్కువ ప్రయోజనం అనే సందేహం అనేక మందిలో ఉంది. ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిగడ్డలను ఆహారంగా తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉంది.

తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వీటిలోని క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి.

వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు. సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి.

ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా సహాయ పడుతుంది.