సోయాబీన్‌ ఆయిల్‌తో ఆ సమస్యలు దూరం..

13 October 2023

అరోగ్యాన్ని అందించే రకరకాల వంట నూనెలు అందుబాటులోకి వచ్చినా సోయాబీన్ ఆయిల్ మాత్రం వెరీ స్పెషల్‌ అంటున్నారు నిపుణులు.

ఇటీవలి కాలంలో సోయాబీన్ ఆయిల్‌ను వంటకాల్లో వాడేందుకు అన్ని వర్గాల ప్రజలు ఇష్ట పడుతున్నారు. ఇందుకు బలమైన కారణాలు లేకపోలేదు.

కేవలం మన దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో సోయాబీన్ ఆయిల్‌కు డిమాండ్‌ పెరుగడాన్ని బట్టి దాని ప్రత్యేకత తెలిసిపోతుంది.

2021, 2022 మ‌ధ్య‌ కాలంలో ఏకంగా 62 మిలియ‌న్ ట‌న్నుల సోయాబీన్ ఆయిల్ ఉత్ప‌త్తి అయింద‌ని సోయాబీన్ ప్రాసెస‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా నివేదించింది.

వంటల్లో సోయాబీన్ ఆయిల్ వాడ‌కంతో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయ‌ని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు.

సోయాబీన్ ఆయిల్‌లో ఉండే పాలీ అన్‌శాట్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు. దీనిలో ఆరోగ్య‌క‌ర కొవ్వులు గుండె జబ్బు ముప్పును నివారిస్తాయి.

సోయాబీన్ ఆయిల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను త‌గ్గించి క‌రోన‌రీ హార్ట్ డిసీజ్ ముప్పు నుంచి కాపాడుతుందని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ తెలిపింది.

అంతే కాకుండా సోయాబీన్‌ ఆయిల్‌తో ఎముక‌ల బ‌లోపేతం, చ‌ర్మ‌సౌంద‌ర్యం, కేశ సంర‌క్ష‌ణ‌ తో పాటు వృద్ధాప్య ఛాయ‌ల‌కు చెక్‌ పెట్టవచ్చని అంటున్నారు.