TV9 Telugu

బియ్యం కడిగిన నీళ్లతో మీ ఆరోగ్యానికి బూస్టప్..

21 Febraury 2024

ఎన్నో రకాల అనారోగ్యాలకు పరిష్కారాలు మన వంటింట్లోనే ఉంది. చాలా సార్లు మనం పనికి రానివిగా పారేసే వస్తువుల్లోనే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

బియ్యం కడిగిన నీళ్లు కూడా అలాంటి పదార్ధాలలో ఒకటి. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలుంటాయని.. డైటీషియన్లు చెబుతున్నారు.

దక్షిణాదిలో మనం ఎక్కువగా రైస్ తింటాం. అన్నం వండటానికి ముందు రైస్‌ను రెండు, మూడు సార్లు కడుగుతాం. ఆ వాటర్‌ను పారబోస్తాం.

కానీ ఈ వాటర్ లో ఉన్న మినరల్స్, విటమిన్స్, అమైనో ఆసిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు రైస్ వాటర్ ఇకపై అస్సలు పారబోయరని అంటున్నారు పోషకాహార నిపుణులు.

బియ్యం కడిగిన నీటిలో కాటన్ లేదా శుభ్రమైన గుడ్డను ముంచి ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖం మెరుస్తుందట. ఈ నీటిని స్కిన్ ఫేషియల్ గా కూడా ఉపయోగించవచ్చు.

ఈ నీటిని జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగడమే కాదు హెయిర్‌ ఫాల్‌ కూడా కంట్రోల్‌ అవుతుందట. బియ్యం కడిగిన నీటిలో లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టును కడగాలి.

అంతేకాదు, బియ్యం కడిగిన నీరు తాగడం వల్ల కడుపులో మంట, విరేచనాలు తగ్గుతాయి. ఈ నీటిలో ఉప్పు, నెయ్యి, ఎండుమిర్చి కలిపి తాగితే జీర్ణశక్తి మెరుగవుతుంది.