బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
25 October 2023
చాల భారతీయ వంటకాల్లో బెల్లానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. బెల్లాన్ని సంప్రదాయ స్వీటెనర్‌గా భావిస్తారు.
సహజమైన విటమిన్లు, మినరల్స్ ఉండటంతో రిఫైన్డ్ షుగర్‌కు బెల్లం మంచి ప్రత్యామ్నాయంగా సూచిస్తారు.
చక్కెరలో కనిపించని ఐరన్, క్యాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో సమృద్ధిగా లభిస్తాయి.
బెల్లంలో హై షుగర్ కంటెంట్ ఉండటం మూలంగా ఇది శరీరానికి తక్షణ శక్తినీ అందించడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో బెల్లాన్ని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కాలేయం శుభ్రపరుస్తుంది.
రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కడమే కాకుండా రోగనిరోధక వ్యవస్ధ బలోపేతమై వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది.
శ్వాస సమస్యలు ఉన్నవారు బెల్లం వాడకంతో ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా బెల్లం వాడకం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి