తిప్పతీగ ఔషధ గుణాల గని.. 

TV9 Telugu

11 August 2024

ఆయుర్వేద ఔషధంలో తిప్పతీగ కూడా ఒకటి. తిప్పతీగ అనేక ఔషధ గుణాల గని. ఇది వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది.

అలాగే శరీరానికి ఇతర గొప్ప ప్రయోజనాలను కూడా అందిస్తుంది. తిప్పతీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వేగంగా పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే తిప్పతీగతో పుల్ స్టాప్ పెట్టొచ్చు. బరువును తగ్గించుకోవడానికి ఆహారంలో దీనిని చేర్చుకోవాలి.

వాస్తవానికి ఈ ప్రయోజనకరమైన మొక్కలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే మూలకాలు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే. తిప్పతీగతో చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం ద్వారా నిద్ర బాగా వస్తుంది.

ఒత్తిడి స్థాయి కూడా చాలా వరకు అదుపులోకి వస్తుంది. దీని ద్వారా మీరు చింత లేకుండా జీవితాన్ని గడపవచ్చు.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. దీని వినియోగం కణాలను బలపరుస్తుంది. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ కొంచెం చేదుగా ఉన్నా షుగర్ లెవెల్ ని చాలా వరకు కంట్రోల్ లోకి తెస్తుంది.