కొబ్బరి నూనె ఉండగా.. ఆరోగ్యంపై చింత ఏలా..
18 September 2024
Battula Prudvi
కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యం నుంచి బరువు తగ్గే ప్రక్రియ వరకూ హెల్త్ కు అన్ని విధాలుగా సాయపడుతుంది.
కొబ్బరి నూనెలోని హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచే లౌరిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.
ఇక కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ సులభంగా జీర్ణమవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు వైద్యులు.
కొబ్బరి నూనె శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియ మెరుగవుతుంది.
ఇది ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావన కలిగించడంతో బరువు తగ్గేందుకూ సాయపడుతుందన్నది నిపుణుల మాట.
కొబ్బరి నూనె గుండె ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు కలిగిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఎముకల బలంగా తయారవుతాయి.
కొబ్బరి నూనె కారణంగా మెదడుకు మేలు, చర్మ, కేశ సంరక్షణతో పాటు రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
మధుమేహం నియంత్రణలో ఉండేందుకు కొబ్బరి నూనెను తీసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి