దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తున్నాయా.. అయితే ఇవి ట్రై చేయండి

15 November 2023

తెల్ల నువ్వుల్లో కన్నా నల్ల నువ్వుల్లో పోషకాలు అధికంగా ఉంటాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు నల్ల నువ్వుల్లో పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటి రోజు తినాలి.

నల్లనువ్వులు తరుచూ వాడటంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జట్టుకు, చర్మానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి.

నల్ల నువ్వుల్లో పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు తగినంత లభిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులతో పాటు ఎన్నో సమస్యల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

నల్ల నువ్వులు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి. దీని కారణంగా ఆరోగ్యంగా జీవిస్తారు.

కాల్షియం, కాపర్, మాంగనీస్, ఐరన్, బీ6 విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

రోజువారీ ఆహారంలో నల్ల నువ్వుల్ని చేర్చుకోవడం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను ముప్పును తగ్గించుకోవచ్చు.