నల్ల నువ్వులను ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
21 October 2023
నల్ల నువ్వుల్లో పోషకాలు మెండుగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్లు, ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్ వంటి మినరల్స్ పుష్కలం.
నల్ల నువ్వుల్లో సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా శరీరానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
నల్ల నువ్వులను పోషకాల గనితో పోల్చుతారు నిపుణులు. నల్ల నువ్వులను ఆహారంలో చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఎముకలు పెళుసుబారి పోయే లక్షణాలున్నవారు నల్ల నువ్వులను తరుచు తీసుకోవడం వల్ల వారి ఎముకలు ధృడంగా తయారవుతాయి.
చర్మ సంరక్షణలోనూ నల్ల నువ్వుల పాత్ర అమోఘం. చర్మం పొడిబారిపోకుండా, స్కిన్ ఎలర్జీలు దరి చేరకుండా ఉండాలంటే నల్ల నువ్వులు తీసుకుంటుండాలి.
నల్ల నువ్వులు జీర్ణక్రియ మెరుగుదలకు, తోడ్పతాయి. అంతేకాకుండా జుట్టు సంరక్షణకు సైతం నల్లనువ్వులను సూచిస్తుంటారు.
నల్ల నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయానికి మేలు కలుగుతుంది. షుగర్ నియంత్రణలో ఉంటుంది.
నల్ల నువ్వులు తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం అవడమే కాకుండా వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి