వర్షాకాలంలో రోగాల బెడద తప్పాలంటే వీటిని రోజూ గుప్పెడు తినండి

06 August 2024

TV9 Telugu

TV9 Telugu

రోగాలు చుట్టుముట్టే ఈ కాలంలో సెనగల్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు గ్యాస్‌ వస్తుంది అనో, తింటే పడదనో వీటిని దూరం పెడుతుంటారు

TV9 Telugu

కానీ పోషకాలు పుష్కలంగా ఉండే సెనగల్ని ‘దేశీ సూపర్‌ ఫుడ్‌’గా చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకే పొద్దున్నే నిద్ర లేవగానే నానబెట్టిన శనగలు తినడం చాలా మందికి అలవాటు

TV9 Telugu

ముఖ్యంగా క్రమం తప్పకుండా క్రీడలు ఆడేవారిలో ఈ అలవాటు కనిపిస్తుంది. శనగల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు అధికంగా ఉంటాయి

TV9 Telugu

శనగలు తింటే ఒంట్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. శనగల్లోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

వృద్ధాప్యంలో ఎముకల వశ్యతను నిర్వహించడానికి ఇది చాలా అవసరం. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి సమస్యలను నివారించడానికి నానబెట్టిన శనగలు క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది

TV9 Telugu

ఈ సీజన్‌లో జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్‌ సంబంధిత సమస్యలు రావడం సహజమే. నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపడుతుంది

TV9 Telugu

నానబెట్టిన శనగలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. నానబెట్టిన శనగల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ఉపయోగపడుతుంది

TV9 Telugu

చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. శనగల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది