రోజ్ టీతో ఆ సమస్యలన్నీ మటాష్..

TV9 Telugu

04 June 2024

రోజ్ టీ తాగడం వల్ల మూడ్‌ని రిఫ్రెష్ చేయడమే కాక టెన్షన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇదే కాకుండా మీ బరువును తగ్గిస్తుంది.

గ్రీన్ టీ మాత్రమే కాదు రోజ్ టీ కూడా బరువు పెరుగుట సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు.

గులాబీ రేకులతో తాయారు చేసిన ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీకు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

గులాబీ రేకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే గులాబీ టీతో తీసుకోవచ్చు.

గులాబీ టీ నిద్రలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

రోజ్ టీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు దీన్ని క్రమం తప్పకుండా తినవచ్చు.

గులాబీ టీ తయారీకి కావలసిన పదార్థాలు పొడి గులాబీ రేకులు – 1 కప్పు నీరు – రుచికి తేనె లేదా చక్కెర – 1 tsp టీ ఆకులు – కొన్ని గులాబీ సారాంశాలు – కొన్ని పుదీనా ఆకులు

గిన్నెలో నీటిని, గులాబీ రేకులను వేసి రంగు మారే వరకు మరిగించి రోజ్ ఎసెన్స్, టీ ఆకులు వేసి, స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల మూత పెట్టి తేనె, పుదీనా జోడించి వేడిగా తాగండి.