వర్షాకాలంలో వేపతో ఈ సమస్యలన్నీ పరార్..
TV9 Telugu
06 June 2024
వర్షాకాలంలో సాధారణం వచ్చే చర్మ సమస్యలు దురద, దద్దుర్లు, మొటిమలు. వేప ఆకులు ఈ సమస్యల నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలిగిస్తాయి.
ఇందుకోసం 12 నుంచి 15 ఆకులను ఒక లీటరు నీటిలో వేసి అరగంట పాటు మరిగించి సాధారణ నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మా ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
వేప ఆకులలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నందున క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు గోళ్లు, మొటిమలు సమస్యలను నివారిస్తుంది.
వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు కారణంగా ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్నికాపాడుతుంది. దీని వినియోగం కారణంగా జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది.
శరీరంలో ఏ ప్రదేశంలోనైనా కురుపుల లేదా మొటిమల సమస్య ఉంటే వేప ఆకులతో పాటు దాని బెరడును రుబ్బి ఆ ప్రదేశంలో రాయాలి. కొద్ది రోజుల్లో ఆ సమస్య తొలగిపోతుంది.
వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కాలానుగుణ జబ్బులియాన జ్వరం, వైరల్ ఫీవర్ మొదలైన సమస్యలను తొలగిస్తుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు వేప ఆకులు తీసుకొంటే సమస్య దూరమవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి