వెల్లుల్లితో ఈ రోగాలు పరుగో పరుగు

TV9 Telugu

04 March 2024

ఆయుర్వేదంలో వెల్లుల్లికు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మనం వంటలో రుచి కోసం ఉపయోగించే వెల్లుల్లిని పరగడుపున తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

వెల్లుల్లిలో ఉండే అనేక పోషకాల వల్ల వృద్ధాప్య లక్షణాలను నియంత్రించవచ్చు. అంతేకాదు ఎముకలకు పటిష్టత చేకూరుతుంది

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు పరగడుపున వెల్లుల్లి తినటం వల్ల ఉపశమనం లబ్బిస్తుంది. అంతే కాకుండా కడుపు సంబంధిత సమస్యలు దరిచేరవు.

వెల్లుల్లి రెమ్మల్ని పరగడుపున తీసుకోవడం వల్ల బ్లడ్ క్లాటింగ్ ముప్పు తొలగిపోతుంది. అంతే కాదు చెడు కొలెస్ట్రాల్ నిర్మూలించబడుతుంది.

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా తగ్గుతుంది. గుండె వ్యాధుల ముప్పు చాలావరకూ దూరమౌతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ ఉండేలా చేస్తుంది వెల్లుల్లి. శరీరంలోని మలినాలు బయటకు పోయి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

 రోజూ కనీసం 3-4 వెల్లుల్లి రెమ్మలు పరగడుపున తింటే కడుపులో వ్యర్ధాలు, మలినాలు శుభ్రమౌతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.