రోజుకి రెండు గుడ్లు తింటే ఆ సమస్యలు పరార్..

15 September 2023

గుడ్డు ఆరోగ్యానికి వెర్రీ గుడ్. గుడ్డులో పుష్కలంగా ఉండే ప్రొటీన్స్‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

మానసిక ఆరోగ్యానికి దోహదపడే సెరోటోనిన్‌ గుడ్డులో ఉంటుంది. దీనినే హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు.

మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జ్ఞాపకశక్తి సంబంధిత విధులను కంట్రోల్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే గుడ్డును తింటే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్ మెదడులో న్యూరోట్రాన్స్మిటర్‌గా పనిచేస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.

ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ప్రతిరోజూ 2 గుడ్లు తినాలి. దీనివల్ల ఒత్తిడి దూరమై సంతోషంగా ఉంటారు.

ప్రతిరోజు గుడ్లు తీసుకోవడం వల్ల ఎముకలలో కాల్షియం సమస్య దూరమై బలంగా మారుతాయని నిపుణులు అంటున్నారు.

గుడ్లు తింటే కొలస్ట్రాల్ స్థాయి పెరుగుతుందన్నది ఒట్టి అపోహ మాత్రమేనని అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలాయి.

గుడ్డును తింటే బరువు పెరుగుతాన్నది కూడా నిజం కాదు. గుడ్డు తింటే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.