టమాటాతో బోలెడు ప్రయోజనాలు..
09 December 2023
సాధారణంగా ఏవైనా కూరలు,వంటకాలు చేయడానికి మరే ఇతర వాటికైనా రంగు, రుచి కోసం ఎర్రగా ఉండే టమాటాలనే వాడుతుంటారు.
అయితే ఎర్ర టమాటా కన్నా పచ్చి టమాటా వల్ల కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.
విటమిన్ కే, ఏ, సి, కాల్షియం, లైకోఫీన్, పొటాషియం అధికంగా ఉండే పచ్చి టమాటాలను తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.
చిన్న పిల్లలకు అప్పుడప్పుడు ఈ పచ్చి టమాటాలను తినిపించడం వల్ల ఎముకలు ధృడంగా వృద్ది చెందుతాయని అంటున్నారు.
పచ్చి టమాటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి నిగారింపు ఇవ్వడంతో జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పచ్చి టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి కాబట్టి.. క్యాన్సర్ ను నివారించడంలో కూడా సహాయ పడుతుంది.
అధిక రక్త పోటు సమస్యతో బాధ పడేవారు పచ్చి టమాటాలను తినడం వల్ల హైబీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టమాటాల్లో బీటా కరోటీన్ వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి