రాక్ సాల్ట్‌తో ఈ వ్యాధులన్నీ దూరం.. 

11 October 2023

రాక్ సాల్ట్ ఔషధం కంటే తక్కువ ఏం కాదు. ఈ సాల్ట్‌ను ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఔషధం

నవరాత్రి పండుగలో రాతి ఉప్పును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దీని వలన హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. 

నవరాత్రి సమయంలో

ఈ రాతి ఉప్పులో 84 ఖనిజాల ఉనికి ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. వీటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, జింక్, రాగి, సెలీనియం ఉన్నాయి.

84 ఖనిజాలు

ఆయుర్వేదం ప్రకారం, రాతి ఉప్పు తినడం ద్వారా 84 వ్యాధులు నయమవుతాయట. రాతి ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. 

ఆయుర్వేదం

పురుషులు రాతి ఉప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి బలహీనతను తొలగిస్తుంది. శరీనికి అవసరమైన శక్తిని అందిస్తుంది. 

వంధ్యత్వం

రాక్ సాల్ట్ తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు కొవ్వు పెరగడం ఆగిపోతుంది. తద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. 

బరువు తగ్గుదల

ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో, రక్తపోటును స్థిరీకరించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

రక్తపోటు

రాక్ సాల్ట్ ఆహారంలో వేసుకోవడం వలన రుచితో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. సాధారణ ఉప్పు కంటే ఈ రాక్ సాల్ట్ వాడటం ఉత్తమం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

రుచితో పాటు ఆరోగ్యం