పచ్చి కొబ్బరి తినడం వల్ల ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందనే భయం మరికొంత మందిలో ఉంటుంది. అదంతా ఒక అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
పచ్చి కొబ్బరిని తరచూ తగిన మోతాదులో తీసుకువడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెపుతున్నారు.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుదలలో పచ్చి కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. వైరస్, బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతూ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల భారి నుంచి రక్షిస్తుంది.
పచ్చి కొబ్బరిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి ప్రజల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పచ్చి కొబ్బరిలో ఎక్కవుగా ఉండే పీచు పదార్థం.. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది.
పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి సమస్యను దూరం చేస్తుంది. మెదడు ఆరోగ్యంగా తయారై అల్జీమర్స్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
పిల్లలు పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎదుగుదల చక్కగా ఉంటుంది. చిన్న వయసులోనే ఎముకలు, కండరాలు పరిపుష్టం అవుతాయి.
పచ్చి కొబ్బరి వృద్ధాప్య ఛాయలు తొందరగా దరి చేరకుండా చర్మం కాంతివంతమవుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.