శీతాకాలంలో వేరుశనగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
TV9 Telugu
13 January 2024
వేరుశెనగ పప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు.
వేరుశనగ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనిలో ప్రోటీన్, విటమిన్లు అధికంగా లభిస్తాయి.
వేరుశనగలో ఉండే ప్రోటీన్స్ చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వేరుశెనగలో మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు వేరుశనగ పప్పులను తినవచ్చు.
అలసినట్లు అనిపించడం, నిద్రమత్తుగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తే తక్షణ శక్తి కోసం కాసిన్ని వేరుశెనగ పలుకులు తింటే సరి.
శీతాకాలంలో తరుచూ వేరుశనగలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎముకలను బలోపేతం చేయడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి.
వేరుశనగల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలపు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి