వేరుశనగలతో అనేక ప్రయోజనాలు..

26 November 2023

ఎముకలు బలంగా ఉండటానికి, చర్మం ఆరోగ్యానికి, జుట్టు దృఢంగా ఉండటానికి వేరుశనగలోని పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి.

100 గ్రాముల వేరుశనగల నుంచి దాదాపు 567 కెలొరీల శక్తి లభిస్తుంది. నానబెట్టి తింటే వీటిలోని పోషక విలువలు శరీరానికి మరింతగా అందుతాయి.

బాడీబిల్డింగ్‌ చేయాలనుకునేవారు డైట్‌లో నానబెట్టిన వేరుశనగ కచ్చితంగా చేర్చుకుంటే అద్భుత ప్రయోజనం ఉంటుంది.

వేరుశెనగలో పుష్కలంగా ప్రొటీన్స్‌ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

ప్రతిరోజూ ఉదయం పూట వేరుశనగ మొలకలు తింటే.. మరీ మంచిదని పోషకాహార నిపుణులు, వైద్యులు తరుచూ సూచిస్తున్నారు.

నానబెట్టిన వేరుశనగలో పుష్కలంగా లభించే ఫైబర్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్ధకం పోగొట్టడంలో తోడ్పడుతుంది.

నానబెట్టిన పల్లీలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటితో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

నానబెట్టిన వేరుశెనగను ఉదయాన్నే తినడం వల్ల పిల్లలు, పెద్దలలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటున్నారు నిపుణులు.